ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ట్విట్టర్ లైట్ యాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 06:50 PM

చాలా తక్కువ స్పీడ్ కలిగిన ఇంటర్నెట్‌ను వాడేవారి కోసం ట్విట్టర్ త్వరలో ట్విట్టర్ లైట్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్ లభిస్తుండగా, ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లకు ట్విట్టర్ లైట్ యాప్ లభ్యం కానుంది. ఈ యాప్ సాధారణ ట్విట్టర్ యాప్ కన్నా చాలా తక్కువగా ఇంటర్నెట్‌ను వాడుకుంటుంది. దీంతో నెట్ స్పీడ్ స్లోగా ఉన్నప్పటికీ యాప్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ సైజ్ కేవలం 3 ఎంబీ మాత్రమే ఉండనుంది. ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు ఈ యాప్ లభ్యం కానుంది. ప్రస్తుతం ట్విట్టర్ ఈ లైట్ యాప్‌ను అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. త్వరలోనే యూజర్లకు లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com