నెల్లూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తోన్న ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని జలదంకి, కావలిలో భారీ వర్షం పడుతోంది. రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.