ప్లాట్‌ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచిన దక్షిణ మధ్యరైల్వే

  Written by : Updated: Thu, Sep 21, 2017, 10:05 AM
 

హైదరాబాద్ : దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్యరైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచింది. రూ.10 ఉన్న ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి ఆక్టోబర్ 3వ తేదీ వరకు అమల్లో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు వీడ్కోలు ఇవ్వడానికి స్టేషన్‌కు బంధువులు, స్నేహితులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్లాట్‌ఫాం ధరలు పెంచితే అవసరమైన వ్యక్తులు మాత్రమే స్టేషన్‌లోకి వచ్చే అవకాశముందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మాత్రమే వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ తెలిపారు.