కర్నూలు నగర శివారులో ఆర్టీసీ బస్సులు ఢీ

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 13, 2017, 06:43 PM
 

కర్నూలు నగర శివారులోని రేడియో స్టేషన్‌ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. కర్నూలు వైపు వస్తున్న ఎమ్మిగనూరు డిపోకు చెందిన బస్సును కర్నూలు-2 డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఎమ్మిగనూరు బస్సు బోల్తా పడగా కర్నూలు-2 డిపో బస్సు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మిగనూరు డిపో బస్సు ఆకస్మాత్తుగా ఆగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కర్నూలు-2 డిపో బస్సు డ్రైవర్‌ ఈశ్వరయ్య తెలిపారు. ఈ ప్రమాద ఘటనతో రహదారి వెంట భారీగా వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.