పులివెందులకు రూ. 10 కోట్లు మంజూరు చేశాం: లోకేష్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 13, 2017, 05:00 PM
 

రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి పక్షపాత ధోరణి లేదని... విపక్ష నేతల నియోజకవర్గాలు కూడా తమకు ఒకటేనని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ అడగకపోయినా ఆయన నియోజకవర్గం పులివెందులకు రూ.10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. విజయనగరంలోని జిల్లాపరిషత్ గెస్ట్ హౌస్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.