ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 08, 2022, 01:35 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి -కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్. రాకేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు 07641 రైలు తిరుపతిలో ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం 3: 20 గంటలకు బయలుదేరి డోన్ కు రాత్రి 9: 15 గంటలకు, కర్నూలుకు 10: 20కి, కాచిగూడకి 18న తెల్లవారుజామున 4గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే 07642 రైలు ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 3: 45గంటలకు కాచిగూడలో బయలుదేరి కర్నూలు, డోన్ మీదుగా తిరుపతికి 14న తెల్లవారుజామున 3: 45కి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa