ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెక్సాస్‌లో కాల్పుల కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2017, 12:37 PM

టెక్సాస్‌: టెక్సాస్‌లోని ఉత్తర డల్లాస్‌లో ఆదివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. డల్లాస్‌లో కౌబాయ్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పార్టీ నిర్వహించారు. ఈ సమయంలో ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి అక్కడ ఉన్న యువతితో గొడవపెట్టుకున్నాడు. అనంతరం తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దుండగుడిని అక్కడికక్కడే హతమార్చారు. ఈ కాల్పులో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com