ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాస్తవ రాజకీయాలు ఉండవు అన్ని కల్పితమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 02:49 AM

విజయ్‌ ఆంటోని, వీయా జార్జీ హీరో,హీరోయిన్‌గా, ద్వారకా క్రియేషన్‌‌స బ్యానరై్ప మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో,  జీవ శంకర్‌ దర్శకత్వంలో, మిర్యాల రవింద్రర్‌ రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్న యమన్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 24న విడుదలకు సిద్దమైంది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హీరో విజయ్‌ ఆంటోనీ పాత్రీకేయుంలతో మాట్లాడారు.  

రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్‌‌స ఏమైనా ఉంటాయా ?
ఈ చిత్రం  పొలిటికల్‌ థ్రిల్లర్‌. ఇందులో ఎలాంటి రియల్‌ లైఫ్‌ ఇన్సిడెం ట్‌‌స ఉండవు. కథ మొత్తం కల్పితమే. గతంలో నేను చేసిన నకిలీ సినిమాలాగే ఇది కూడా క్రియేట్‌ చేయబడిన స్టోరీనే.


రాజకీయాల గుర్చి ఏవిధంగా చెప్పారు.


సినిమా ప్లాట్‌ పాలిటిక్‌‌స కాబట్టి అసలైన రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, వారి బిహేవియర్‌ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. ఒక సామాన్యుడు మంత్రిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమాలో ప్రధాన అంశం.

తమిళనాడు రాజకీయాల గుర్చి ఉంటుందా?
లేదు.. ఇందులో ప్రత్యేకంగా తమిళ రాజకీయాల గురించి ఏమీ చెప్ప లేదు. 5 ఏళ్ల క్రితమే ఈ కథ తయారైంది. ఇప్పటి తమిళ పరిస్థితులకు, సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథ అన్ని రాష్ట్రాల రాజకీయాలను టచ్‌ చేస్తుంది.


యమన్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు ?
 చెడు పనులు చేసేవారికి యమన్‌ యముడు లాంటి వాడు. యమన్‌ అంటే శివుడి అవతా రం. ధర్మాన్ని కాపాడే యమధ ర్మరాజు. పురా ణాల్లో కూడా యముడిని గొప్పగా చూపారు. ఈ సినిమాలో ఆ యముడిని కొత్త కోణంలో చూపడం జరి గింది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో చెడు రాజకీయ నాయకులకు యముడు.


 ఈ కథ విజయ్‌ సేతుపతి దగ్గర్నుంచి మీ దగ్గరకొచ్చిందా ?
 అవును.. దర్శకుడు ముందుగా ఈ కథను ఆయనకే చెప్పాడు. కానీ సేతుపతికి మరో 3 ఏళ్ల వరకు ప్రాజెక్ట్స ఉండటంతో ఆయన డేట్‌‌స కుదర లేదు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న నటుల్లో అయనే చాలా బిజీ యాక్టర్‌. దాంతో దర్శకుడు ఈ కథ నాకు చెప్పాడు. కథ నచ్చి నేను వెంటనే డేట్‌‌స ఇచ్చేశాను.


 మీరు చేసిన భేతాళుడు ఎందుకంత సక్సెస్‌ కాలేకపోయింది ?
 భేతాళుడు మంచి సబ్జెక్‌‌ట. కానీ సరిగా ఆడలేదు. సినిమా రిలీజయ్యాక మేం చేసిన తప్పేమిటో తెలిసింది. అదేంటంటే విలన్లని ఫస్టాఫ్‌ లోనే రివీల్‌ చేసుండాల్సింది. కానీ అలా చేయకపోవడంతో ఫస్టాఫ్‌ లో చెప్పిన జయలక్ష్మి పాత్ర వెనుక పెద్ద థ్రిల్లింగ్‌ కథ ఉం టుందని ఆడి యన్‌‌స అనుకు న్నారు. కానీ సెకండాఫ్‌లో అలా లేదు. దాంతో రిజల్‌‌ట అనుకున్న విధంగా రాలే దు. కానీ తమిళంలో మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చేశాయ్‌.


మొదటిసారి పొలిటికల్‌ జానర్‌ చేస్తున్నారు. ఎలా ఉంది ?
  చాలా హ్యాపీగా ఉంది. నాకు జానర్‌, డైరెక్టర్‌ తో పని లేదు. సినిమా కథ ఏమిటి అనేది మాత్రమే చూస్తాను. కథ బాగుంటే పొలిటికల్‌ డ్రామా సినిమాలు వరుసగా చేస్తాను. సాధారణంగా ఒకే తరహా సినిమాలు వరు సగా చేస్తే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుందంటారు. కానీ మంచి కథ, స్క్రీన్‌ ప్లే ఉంటే ఒకే తరహా సినిమాలనైనా ఆడియన్‌‌స ఆదరిస్తారు.

నటనతో పాటు ప్రొడక్షన్‌ కూడా చేస్తుంటారు. రెండూ ఒకేసారి చేయడం ఎలా అనిపిస్తుంది ?
 ఒక నటుడు ప్రొడక్షన్‌ చేస్తే అతనికి నిర్మాత కష్టమే మిటో తెలుస్తుంది. ప్రొడక్షన్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. సినిమా చేసి, ప్రమో షన్‌ చేసి, డిస్ట్రిబ్యూ షన్‌ చేసి చివరికి రిలీజ్‌ చేసేదాకా నిర్మాత కష్టప డాలి. ఒకసారి నిర్మాత కష్టం అర్థమైతే హీరో లు కూడా అన్ని విష యాల్లోనూ వారికి సహకరిస్తారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com