ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబాలని బట్టి హీరోలను ఎవరినీ సపరేట్‌ గా ట్రీట్‌ చేయను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 02:43 AM

 సాయి ధరమ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరో,హీరోయిన్‌గా, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్‌‌స బ్యానర్‌పై  బేబి భవ్య సమర్పణలో, నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి) , ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న విన్నర్‌ చిత్రం మహా శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 24న విడుదలకు సిద్దమైంది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చిత్ర హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్రీకేయులతో మాట్లాడారు.


 ఈ చిత్రంలో మీ రోల్‌ ఎలాంటిది?


ఇందులో నాదొక అథ్లెట్‌ పాత్ర. అలాగే జాకీని కూడా. నా వలనే హీరో తేజ్‌ హార్‌‌స రేస్‌ అనే విషయంలోకి దిగుతాడు. సినిమాలో నిజ మైన అథ్లెట్‌ గా కనిపించేలా ఉండటానికి సరైన ఫిట్నెస్‌ కోసం చాలా వర్కవుట్‌‌స చేశాను.


 ఈ చిత్రం ఎలా ఉంటుంది?


 సినిమా పూర్తి కమర్షియల్‌ ఎంటరై్టనర్‌గా ఉం టుంది. టెక్నికల్‌ వాల్యూస్‌ కూడా బాగుం టాయి. చోటా కె నాయుడు సినిమాని చాలా అందంగా చేశారు. హార్‌‌స రైడింగ్‌ సన్నివేశాలు టర్కీలో షూట్‌ చేశాం. చాలా బాగా వచ్చాయి. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్‌‌స కూడా మన సుకు హత్తుకునే విధంగా ఉంటాయి.


సాయి ధరమ్‌ తేజ్‌ తో పని చేయడం ఎలా ఉంది ?


తేజ్‌, నేను చాలా కాలం నుండి ఫ్రెండ్‌‌స. అది సినిమాకి బాగా ఉపయో గపడింది. సెట్లో ఎప్పుడూ సరదాగా చిన్న పిల్లల్లా అల్లరి చేస్తూ ఉంటాం. తేజ్‌ వాళ్ళ అమ్మని గౌరవించే విధానం చాలా గొప్పగా ఉం టుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అతనిది.


 మెగా హీరోలతో వర్‌‌క చేయడం ఎలా ఉంది ?


 నా వరకు అందరు హీరోలు ఒకటే. నేను వాళ్ళ కుటుంబాలని బట్టి ఎవరినీ సపరేట్‌ గా ట్రీట్‌ చేయను. ప్రతి హీరోకి మ్యాగ్జిమమ్‌ రెస్పెక్‌‌ట ఇస్తాను. వాళ్ళతో కలిసి ప్రాజెక్‌‌ట కోసం నా వంతు నేను కష్టపడతాను.


 గోపీచంద్‌ మలినేనితో పని చేయడం ఎలా ఉంది ?


  గోపీచంద్‌ మలినేనితో నేను పని చేయడం ఇది రెండోసారి. ఆయన నటులకు కావాల్సినంత ఫ్రీడమ్‌ ఇస్తారు. ఆయన నా పాత్రను వివరిం చిన తీరు చాలా బాగుంటుంది. చాలా సరదాగా ఉంటారు. కావల్సిన అవుట్‌ ఫుట్‌ నటుల నుండి ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు.


ఇన్ని ప్రాజెక్‌‌ట్స ఒకేసారి ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు ?


 నేనైతే బాగానే హ్యాండిల్‌ చేస్తున్నానని అనుకుంటున్నాను. డేట్లు కుదరక కొన్ని సినిమాలు వదులుకుంటే కొన్నింటిలో నా స్థానంలో వేరే వాళ్ళను తీసుకున్నారు. ఆలా నేను దూరమైన ప్రాజెక్ట్స చాలా వరకు ఫ్లాప్‌ అయ్యాయి. దేవుడే నాకు మంచి ప్రాజెక్‌‌ట్స వచ్చేలా చేస్తున్నాడని భావిస్తున్నాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com