ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లమలలో యురేనియం తీయడం ఎవరికి లాభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:28 PM

 -యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం బార్లా తెరిచింది


 -అంగవైకల్యంతో నష్టపోవాల్సి వస్తుందంటున్న నిపుణులు 


 -ఖాళీ చేయాల్సిందే అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు


 -నెల రోజులు పూర్తిగా హెలికాప్టర్‌ ద్వారా చక్కర్లు కొట్టారు


  -కారు చౌకగా దేశ సంపదను కట్టబెట్టే కు్ట్ర జరుగుతోంది


1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత దేశంలోని అన్ని రకాల ఫలాలు. పల్లె ప్రజలందరికి చేరాలని అభివృద్ధి వైపు పయని ంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగం పర్యవేక్షణలో అభివృద్ధి కావాల్సిన 5వ షెడ్యూల్‌‌డ  ఏజన్సీ ఏరియాను కొంతమంది పెట్టుబడి దారుల చేతిలోపెట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. యురేనియం తవ్వకాలను రాష్ట్రప్రభుత్వం బార్లా తెరిచింది. పలు అభివృద్ధి చెందిన దేశాలే వ్యతిరేకించాయి. పర్యావరణం దెబ్బతిని జీవ జంతువుల నాశనం అవుతాయని అంగవైకల్యంతో నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే విదేశాలు అనుమతి ఇవ్వలేదు. దేశంలోని నల్లమల అటవీ ప్రాంతం 2వ స్థానంలో ఉన్నది. రిజర్వుడు ఫారె స్టులను  టైగర్‌ ప్రాజెకు ్టలుగా పిలువ …బడుతున్నాయి. గత కొద్దికాలం నుండి పులులు రక్షణ పేరుతో అటవి నుండి గ్రామాలు తరలించాలని కుట్ర పన్నింది. ఇపుడు యురేనియం తీయడం కోసం ఆ గ్రామ ప్రజలను నిర్వాసితులను చేయాలని పాలకులే  అనుమతులు ఇవ్వడం శోచనీయం. దీనితో భారీఎత్తున ప్రజలకు నష్టంతోపాటు ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది.  కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉంది.  రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు ఉల్లఘి స్తుంటే ఎవరు పట్టించుకోవాలో అర్థంగాని పరిస్థితి ఉంది.  నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పధర మండలంలో 16 రేవిన్యూ గ్రామాలు,  18 గ్రామ పంచాయితీలు 35 హంబ్లేట్‌‌స . 18 చెంచుపెంటలు ఉన్నాయి. 62011 జనాభా కలిగి యున్నది.  5400 ఎకరాల వరిపొలం, 36009 ఎకరాల మెట్టపొలం సాగు అవుతుంది. ఈ 11457 మంది రైతులు జీవనం సాగిస్తూ తమ కుటుం బాన్ని పోషించుకుంటున్నారు.  ఎస్సీ 30శాతం, ఎస్టీ  20శాతం, బిసి 35 శాతం, ఓసి  10శాతం ఇతరులు జీవిస్తున్నారు.  247222 ఎకరాల ఫారెస్టు భూమి ఉంది.  1903 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. అటవి మీద 50వేల పశు వులు,గేదెలు  6500, గొర్రెలు 8200, మేకలు 100,000 జీవిస్తుండగా కోళ్ళు 8500 ఫారెస్టు ఆధారంగా జీవిస్తున్నాయి. వాటిని ఏజన్సీలో బిపిఎల్‌ కార్డులు 13232 ఉన్నాయి. అంగన్‌వాడీ సెంటర్‌‌స  87, చెరువులు 15,  బావులు6,87 విద్యా సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.  వీన్నింటిని లెక్క చేయకుండా  ఖాళీ చేయాల్సిందే అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. యురేనియం తీయా ల్సిందే అంటూ ప్రతిపాదనలు చేస్తున్నారు.  ఏజన్సీ ప్రాంతంలో ఇప్పటికీ అభి వృద్ధి పనులకు నోచుకోలేదు. రోడ్లుమంజూరైనా వేయని పరిస్థితి ఉంది. కరెం టు, ఇండ్లు, కట్టుకుందామన్నా అడ్డుపడుతున్నారు.  68 ఏండ్ల స్వాతంత్య్రా నంతరం ఏజన్సీలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.  అటవీహక్కుల చట్టం క్రింద గిరిజనులు పేదలకు 110 ఎకరాల భూమి ఇవ్వాలి కాని ఇవ్వడంలేదు. ఏజన్సీలో ఉన్న విద్యార్థులకు ఏజన్సీ ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదు. గ్రామా ల్లో కమ్యూనిటీ హాలు కనిపించడంలేదు.  జీవనాధం ఆరో ధారవాగు,  మాను బడ్డ వాగు నిర్మాణం చేపడితే సాగు, త్రాగునీరు అందించవచ్చు. జంతువులకు దాహం తీర్చవచ్చు. గిరిజన సహకార సంస్థల ద్వారా అటవి ఫలాలు సేకరించేది గిరిజనులు సేకరించడంలేదు.  అభివృద్ధికి ఆటంకంగా మారారు ఈ పాల కులు. ఏజన్సీ ప్రాంతం పూర్తిగా రాష్టప్రతి, గవర్నర్‌ పరిపాలన ఆధ్వర్యంలో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి పనులు చేసిన  ఎటువంటి కార్యక్రమాలు జరిగినా పూర్తి హక్కు గ్రామసభకు ఉంది. పెసా చట్టం, సమత జడ్జిమెంట్‌, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టంఅమల్లో ఉంది. వీటిని బేఖాతరు చేస్తూ ఇక్కడి ప్రజలకు పులుల రక్షణ పేరుతో గ్రామాలను తరలించాలని అనుమతులు ఇచ్చింది.   2009 జిఓ 41,45 ద్వారా సర్వేలు చేస్తున్నారు. 2009 కాంగ్రెస్‌ ప్రయత్నించగా గిరిజన సంఘం, రాజకీయ పార్టీల వత్తిడితో ఆగిపోయింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏకంగా యురేనియం తవ్వకాలు చేపట్టాలని 2016 డిసెంబర్‌ 6న సమావేశం ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన యురేనియం తవ్వకాలు జరుపాలని చర్చ జరుగు తుంది. పదర మండలం ఉడిమలి ్లగ్రామంలో తవ్వకాలు మొదలు పెట్టాలని బోర్లు వేసి మట్టిని తీసుకెళ్ళారు.  ఉప్పునూతల ప్రాంతంలో  సర్వే చేశారు. నెలరోజులు పూర్తిగా హెలికాప్టర్‌ ద్వారా చక్కర్లు కొట్టారు. ఇపుడు యురేని యంతోపాటు రంగురాళ్ళు, వజ్రాలు, బంగారం దొరుకుతాయం టున్నారు. మట్టిరాళ్ళు, అటవి వనరులకు కలపను సైతం అమ్ముకొని సొమ్ము చేసుకో వాలని ప్రయత్నిస్తున్నారు. యురేనియం తవ్వినప్రాంతం నుండి ఎటు 83 కిలోమీటర్ల దూరంలో పొల్యూషన్‌ ప్రభావం ఉంటుంది. దీనితో మాన వాళికే కాదు నల్లమల అడవిలో ఉన్న చెట్లు జీవరాసులు అన్ని ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది.  కృష్ణానది 20కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది.  నీ ళ్ళు, పొల్యూషన్‌ అవుతున్నాయి. హైదరాబాద్‌ ప్రజలు కూడా ప్రమాదానికి గురికావాల్సిందే. ఎస్‌ఎల్‌బిసి సొరంగం  61 కిలోమీటర్లు ద్వారా నల్లగొండకు వస్తుంది. అది కలుషితం కావాల్సిందే. ప్రజాస్వామ్యం కనుమరుగవుతుంది. 2003 జనవరి 3 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలతో కుమ్మక్కు అయ్యారు. కారు చౌకగా దేశ సంపదను కట్టబెట్టి కుట్ర జరుగు తుంది. దేశ సంపదను భావితరాలకు ఉండకుండా చేస్తున్నారు. దీనితో మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. 2010-12 నుండి హెలిక్యాప్టర్ల ద్వారా చక్కర్లుకోడుతూ సర్వేలు నిర్వహిస్తున్నారు. 2014న వచ్చిన బిజెపి ప్రభుత్వం బరితెగించి దేశవ్యాపితంగా ఖనిజాల వెలికితీత కోసం అనుమతులు ఇస్తున్నది. యురేనియం  తవ్వకాల అనుమతికోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సర్కు్యలర్‌ జారీచేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2016 డిసెంబర్‌ 6వ తేదీన వన్యప్రాణి పరిరక్షణ బోర్డు సమావేశపరిచింది.  నాగర్‌కర్నూలు జిల్లా పధర మండలం ఉడిమిల్లా కేంద్రంగా 83 చదరపు కిలోమీటర్లు పరిధిలో యురేనియం నిక్షేపాలు అన్వేషణకోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చి ంది. యుసివిఎల్‌ (యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) అనే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే సంస్థ అణుశక్తి సంఘంతో కలిసి నల్లమల్ల అటవి ప్రాంతంలో తవ్వకాలకోసం సర్వే జరుగుతుంది.   యురేని యం మహమ్మారి ప్రజలపట్ల ప్రమాదమని గ్రహించి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్‌‌స అనుమతులను రద్దుచేసుకున్నారు.  జార్ఖండ్‌ రాష్ట్రంలో బాదుగుడ ప్రాంతంలో 30 సంవత్సరాల కాలం నుండి  దాని ప్రభావం వల్ల దారిద్య్రం అనుభవి స్తున్నారు.  అంగవైకల్యంతో భారీగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. చేతులు, కాళ్లు, తల, ముఖం పూర్తిగా అసంపూర్తిగా ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మానవుని ఆకారం మారిపోతుంది. నల్లమల్ల ప్రాంతంలో టూరిజం పేరుతో అభివృద్ధి చేయాల్సిన మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, నరసింహస్వామి, ఉమామహేశ్వరం ఆలయం, చెంచులు జంతువులను ఆరాధించే పూజించే ప్రాంతం.  భైర„వపురం, నలుమూలల నుండి ఆంజనేయ స్వామి భక్తులు, మాళీ లు మొక్కలు తీర్చుకునే పబ్బతి. ఆంజనేయస్వామి దేవాలయంలో ఉంది.  అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు ఈ పాలకులు. కృష్ణానది 1100 టిఎంసి నీళ్ళు కలుషితం అవుతున్నా ఎంత నష్టం ఉందో అర్థం కావడంలేదు. 1972 వన్యప్రాణి రక్షణ చట్టం  తుంగలో తొక్కుతున్నారు. 5 జిల్లాల సరిహద్దు ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది. 61 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బిసి  తరతరాలుగా  అడవే ఆధారంగా జీవిస్తున్న ప్రజలపై పిడుగుపడ్డట్టు అయింది.  మంచినీళ్ళు స్వరంగం విధ్వంసం కోసమేనా?  చేనూపిచం తవకవరాలరోం నూకవ పినకవహిం,ఆలపి సధర, ఉడిమిల్లా, అక్కారం, బక్కలింగాయపల్లి, రాయలగండి, లక్ష్మీపూర్‌, మాదడుగు, పట్రాల్‌బేను, అప్పపూర్‌,చౌరాపూర్‌, సోమశిల, అలటంపేంట, పచ్చగట్టు, యుసిఐఎల్‌ కంపెనీలకు లీజుకు ఇచ్చే శారు. అటవి సంపదను ఒడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్పడానికి వ్యతిరే ించాలి.  ఏజన్సీ హక్కులను రక్షించుకోవాలి. 1994 స్టిఫెన్‌ హాంకింగ్‌ జీవ వైవిధ్య అవసరం చిన్న జీవుల నుండి అనేక జీవరాసులు భూమిమీద ఉంటే వైరస్‌ను అరికట్టవచ్చు అని అన్నారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com