హర్దోయ్: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని మాటలతో మభ్య బెట్టి లైంగిక దాడికి యత్నించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని స్థానికుడు బాల్భద్ర అలియాస్ మస్తాన మాటలతో మభ్య పెట్టి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఇంతలో గమనించిన చిన్నారి తల్లి అప్రమత్తమై పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వెంటనే వారంతా వచ్చి మస్తానాను చితకబాదారు. అనంతరం గుండు గీసి.. చెప్పుల దండ వేసి మహిళల చేత చెప్పులతో కొట్టించారు. ఆ తర్వాత గ్రామంలో వూరేగించారు. మస్తానపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు హర్దోయ్ పోలీసు సూపరింటెండెంట్ విపిన్ కుమార్ మిశ్రా తెలిపారు.