శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ రెండు నెలలు సెలవు తీసుకోనున్నాడు. రెండవ కూతురు పుట్టినప్పుడు రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 2015లో తన మొదటి కూతురు మ్యాక్స్ పుట్టినప్పుడు కూడా రెండు నెలల లీవ్ తీసుకున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపాడు. తనకు త్వరలో మరో కూతురు పుట్టబోతున్నదని, అప్పుడు ఆ అద్భుత క్షణాలను ఫ్యామిలీతో గడపాలని, అందుకే రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకోనున్నట్లు ఫేస్బుక్ సీఈవో చెప్పాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అతను లీవ్ తీసుకునే అవకాశం ఉంది. ఫేస్బుక్ సంస్థ తమ ఉద్యోగులకు నాలుగు నెలల పాటు మెటర్నిటీ, పెటర్నిటీ సెలవులు ఇస్తుందని తన పోస్ట్‌లో జుకర్‌బర్గ్ చెప్పాడు.