న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగినులకు అండగా నిలవాల్సిన సెక్యూరిటీ మేనేజరే.. ఓ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో చోటు చేసుకుంది. జులై 29న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలైన ఉద్యోగిని మాటల్లోనే.. ఆ రోజు నా పుట్టిన రోజు. సెక్యూరిటీ మేనేజర్ ఆయన గదిలోకి నన్ను పిలిచాడు. క్రెడిట్ కార్డు తీసుకొని ఇష్టమున్న గిఫ్ట్ తీసుకొమన్నాడు. నేను అక్కడ కూర్చోకోకపోవడంతో నా చీరను లాగాడు. ఆ సమయంలో గదిలో ఉన్న అందరినీ బయటకు వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత నా చీర లాగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అదే రోజు రాత్రి హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ కు తెలియజేశాను. అయినప్పటికీ ఇప్పటి వరకు సెక్యూరిటీ మేనేజర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా భర్త సూచన మేరకు ఆగస్టు 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండు వారాలకే ఆ హోటల్ నుంచి ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు లేఖ వచ్చింది. దీంతో షాక్ కు గురయ్యాను. ఇప్పటికే పలుమార్లు నన్ను లైంగిక వేధించాడని బాధితురాలు వాపోయింది.