నంద్యాల ఓటర్లు లౌక్యంతో వ్యవహరించాలి: వైఎస్‌ జగన్‌

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 04:36 PM
 

కర్నూలు: నంద్యాల ఓటర్లు లౌక్యంతో వ్యవహరించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం నంద్యాలలో రోడ్‌ షో నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నంద్యాలలో గెలుపు కోసం సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక, మద్యం, రాజధాని నిర్మాణంలో అక్రమాలకు పాల్పడుతున్నారని, అన్యాయానికి వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు ఓటేయాలని జగన్‌ పిలుపు ఇచ్చారు.