తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 10:38 AM
 

తిరుమల : తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ నిండిపోవడంతో.. వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఎదుట కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.