దేశ భవిష్యత్ నేటి యువతరంపై ఆధార పడి ఉంది : ప్రవీణ్కుమార్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 05:51 PM
 

దేశ భవిష్యత్ నేటి యువతరంపై ఆధార పడి ఉంది...పారిశ్రామికంగా రంగాల్లో దూసుకుపోతూనే దేశాభివృద్దికి దోహదపడే ఆవిష్కరణపై దృష్టి సారించేలా కేంధ్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి శ్రద్ద వహిస్తున్నాయి...దాంట్లో బాగంగా యువజనోత్సవాలను నిర్వహించి తద్వారా వారిలో అసమానతుల తొలగించేలా వారితో మేధావుల స్పూర్తిని రగిస్తూనే నిర్ధిష్ట లక్షాలను అదిగమించేలా ప్రొత్సాహం ఇచ్చేందుకు ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి...విశాఖ వుడా చిల్డ్రన్ ధియేటర్ లో జరిగిన యువజనోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గోన్నారు...ఈ సందర్బంగా వారికి భవిష్యత్ పై ఉన్న శిఖరాలను అదిరోహించేందుకు పలు సూచనలు చేసి దిశానిర్ధేశం చేశారు...తమలో ఉన్న ప్రతిభకు నైపుణ్యాన్ని జోడించి పలు ఆవిష్కరణల దిశగా అడుగు వెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు...ముఖ్యంగా నైతిక విలువలతో కూడిన విద్యను అనుసరిస్తూనే సమాజ హితం కోసం తమ వంతు కృషి చెయ్యాలని కోరారు..మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ది చేసుకుంటూ ప్రభుత్వ , ప్రవేట్ రంగాల్లో రాణించి దేశాభివృద్ది సహకరించాలని అన్నారు...