శరద్‌ యాదవ్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఝలక్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 05:03 PM
 

జనతా దళ్ యూనైటెడ్‌  మాజీ అధ‍్యక్షుడు.. సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ గట్టి ఝలక్‌ ఇచ్చారు. రాజ్యసభలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శరద్‌ యాదవ్‌ ను  ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఇందుకు సంబంధించి రాజ్యసభ ఛైర్మన్‌  అయిన వెంకయ్యనాయుడుకు సమాచారం ఇచ్చారు. కొత్త ప్రతినిధిగా నితీశ్ సన్నిహితుడు ఆర్‌.సి.పి సింగ్ పేరును ప్రతిపాదించారు. మొత్తం జేడీయూ తరపున పార్లమెంట్‌లో ఇద్దరు లోక్‌ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐతే నితీశ్‌ బీజేపీతో జత కట్టడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త పార్టీ పెట్టాలని శరద్‌ యాదవ్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరద్‌ యాదవ్‌ ను తొలగించి ఆయనకు నితీష్ ఝలక్ ఇచ్చారు.