కెన్యా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 03:00 PM
 

  కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో ఉహురు కెన్యట్టా రెండోసారి విజయం సాధించారు. వివాదాలమయమైన అధ్యక్ష ఎన్నికల్లో కెన్యట్టా 54.27 శాతం ఓట్లతో విజేతగా నిలవగా.. ఆయన ప్రత్యర్థి రైలా ఓడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. తనపై మారోమారు విశ్వాసం ఉంచినందుకు కెన్యా ప్రజలకు కెన్యట్టా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ.. దేశానికి, దేశ ప్రజలకు సేవ చేసేందుకు పునరంకితమవుతామని తెలిపారు. దేశ నిర్మాణంలో కలిసి రావాలని ప్రత్యర్థి వర్గానికి పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపుపై తమ ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ ఓడింగాకు చెందిన జాతీయ మహా కూటమి అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రకటించే కార్యక్రమాన్ని బహిష్కరించింది.