పుల్లేటికుర్రులో బాలయ్య పూజలు

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 02:58 PM
 

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్సీయానంలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమహేంద్రవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో బాలకృష్ణకు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన బాలకృష్ణ అంబాజీపేటలోని పుల్లేటికుర్రులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.