లోకేష్ రాహుల్ రికార్డు

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:39 PM
 

కాండీ: శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ రికార్డు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 67 బంతుల్లో నాలుగు ఫోర్లతో కెరీర్‌లో తొమ్మిదో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఇది రాహుల్‌కు వరుసగా ఏడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. వరుస ఏడు ఇన్నింగ్స్‌ల్లో 50 అంతకంటే ఎక్కువ పరుగులను చేసిన ఆటగాడిగా అతడు ఘనత సాధించాడు. అతడి కంటే ముందు ఐదుగురు ఆటగాళ్లు ఈ ఘనతను సాధించారు. వీక్స్, ఆండీ ఫ్లవర్, చందర్‌పాల్, సంగాక్కర, రోజర్స్ రాహుల్ కంటే ముందున్నారు. ప్రస్తుతం భారత్ 22 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. ధవన్ 57, రాహుల్ 54 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.