పురుగుల మందు తాగి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 01, 2021, 11:01 AM
 

పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నసంఘ‌ట‌న ఆదోని ప‌ట్ట‌ణంలోని ఫ‌రీస్సా మొహ‌ల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివ‌రాల ఇలా ఉన్నాయి. ఫ‌రీస్సా మొహ‌ల్లాలో నివాస‌ముంటున్న అజీజ్ (28) అనే యువ‌కుడు సెంట్రింగ్ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగించేవాడు. కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌న‌స్తాపం చెంది పురుగుల ముందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌గా కుటుంబ స‌భ్యులు ఆదోని ఏరియా ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం క‌ర్నూలుకు త‌ర‌లిస్తుండ‌గా మార్గం మ‌ధ్య‌లో మృతి చెందిన‌ట్లు తెలిపారు. కేసు న‌మ‌దు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.