ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 24, 2021, 04:31 PM
 

ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉలిందకొండ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలు జిల్లా, కల్లూరు మండల పరిధిలోని యాపర్ల పాడు గ్రామానికి చెందిన బోయ శ్రీరాములు అతని భార్య లక్ష్మి దేవి తన మనవరాళ్లకు ఉలిందకొండ లో వైద్యం చేయించుకుని తిరిగి స్వగ్రామం వెళుతుండగా యాపర్లపాడు గ్రామం నుండి నీళ్లు నింపుకొని వస్తున్న నీళ్ళ టాంకర్ కల్వర్ట్ దగ్గర వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు (45) అక్కడికక్కడే మృతి చెందగా.. బోయే లక్ష్మీదేవికి తీవ్ర గాయాలు తగిలాయని, అలాగే బైకుపై ఉన్న వారి మనవరాలు ఎగిరి చెట్లలో పడడంతో పాప ప్రాణానికి ఎలాంటి హాని జరగలేదన్నారు.


ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ రావడంతో ట్రాక్టర్ కు బ్రేకులు పడక ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడం జరిగిందని, డ్రైవర్ ట్రాక్టర్ ను వదిలి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. అలాగే మృతిచెందిన శ్రీరాములు బాడిని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.