నల్లమలలో గుప్త నిధులు..?

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 24, 2021, 03:52 PM
 

నల్లమల అటవీ ప్రాంతం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలలో చాలా మేరకు విస్తరించిన ఈ అడవులలో ప్రకృతి అందాలు అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు. వన్య ప్రాణాలు ఇక్కడ ఎన్నో రకాల జీవజాతులు జీవిస్తూ ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతాలలో నివసించే కొన్ని తెగలకు చెందిన జాతి వారు ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు.


అడవి తల్లి పై ఆధారపడి జీవిస్తు వారు తమ జీవితాన్ని ఎంతో హాయిగా ప్రకృతి ఒడిలో గడుపుతూ ఉంటారు. కానీ ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని.. గుప్తనిధుల కోసం వేటాడే ముఠాలు అడవినీ జల్లెడ పడుతున్నాయి. అంతేకాదు అటవీ ప్రాంతంలో పూర్వం రాజుల కాలంలో నిర్మించిన దేవాలయాలు ధ్వంసం చేసి.. వాటిలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు, సంఘటనలు చాలానే బయటకు వచ్చాయి.


ఇక కొన్ని రోజుల క్రితం అయితే గుప్తనిధుల కోసం అడవిలోకి వెళ్లి దారి తప్పి పోయి నీరు ఆహారం దొరకక కొంతమంది మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఒకపక్క అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. గుప్తనిధులు ఉన్నాయన్న పుకార్లతో గుప్తనిధుల ముఠాలు నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ వేట కొనసాగిస్తూనే ఉంది.


నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ప్రకృతి పరమైన ఎంతో విలువైన శ్రీ గంధం మొక్కలు ఉంటాయి. ఒకపక్క అటవీశాఖ అధికారులు ఆ సంపదను కాపాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు వన్యప్రాణులను వేటాడే ముఠా నుంచి కూడా వన్యప్రాణులను రక్షించుకుంటూ అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నారు.


గుప్త నిధులు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయని చాలామంది అత్యాశకు పోయి నల్లమల అటవీ ప్రాంతాలలో సంచరిస్తూ.. నిధుల దొరకక పోగా వారి ప్రాణాలను కోల్పోతున్నారు. కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఈ గుప్త నిధుల వేట మరింత జోరుగా సాగుతుంది. ఈ అటవీ ప్రాంతం సంబంధిత అధికారులతో నల్లమల అటవీ ప్రాంతంలో ఎటువంటి గుప్త నిధులు లేవని, అనవసరంగా వాటి కోసం తిరిగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు.