నా భర్తను చంపేశారు..!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 24, 2021, 01:22 PM
 

కర్నూలు: పొలం గట్టు తగాదాలో తన భర్తను చంపేశారని మృతుని భార్య పీగలగట్టు ఈరమ్మ ఆరోపించింది. కర్నూలు జిల్లా, కోసిగి మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన ఈరన్న (42) అనే వ్యక్తి నంద్యాల రైల్వే పట్టాలపై శవమై కనిపించారని మృతుని భార్య అన్నారు. తమ పక్క పొలం వ్యక్తులు నెల రోజుల క్రితం బెదిరించడంతో తన భర్త పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆమె తెలిపింది. ఎక్కువ వెతికినా జాడ తెలియలేదని, హఠాత్తుగా రైలు పట్టాలపై శవమై కనిపించాడని మృతుని భార్య కన్నీరు మున్నీరు అయ్యింది. భర్త జేబులోని ఫోన్ నెంబర్ ఆధారంగా రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారని ఆమె తెలిపింది. ఈ మేరకు ఆమె కోసిగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.