కర్నూల్ జిల్లాలో జాబ్ మేళా

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 20, 2021, 01:55 PM
 

కర్నూలు జిల్లాలో ఈ నెల 22వ తేదీన డీఆర్‌డీఏ-సీడాప్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ క్రాంతి పథం - డీఆర్‌డీఏ పీడీ బి. కె. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కార్పొరేట్ సంస్థల్లో సుమారు 502 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.


పదవ తరగతి, ఆపై అర్హతలు కలిగిన యువతీ యువకులకు వారి విద్యార్హతలు, వయస్సు, అనుభవాన్ని బట్టి అవకాశాలు ఉంటాయని తెలిపారు. బి. తాండ్రపాడు సమీపంలోని టీటీడీసీ భవనం, ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ సెంటర్ లో ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.


ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 92953 55950, 90142 96452, 63043 40362ను సంప్రదించాలని సూచించారు.