ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ టిప్స్‌తో ఈజీగా మళ్లీ ఉద్యోగం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 01:53 PM

మహిళలు .. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొత్త కొత్త సవాళ్లను చేధిస్తున్నారు. ఎలాంటి ఉద్యోగంలోనైనా తమ సత్తా చాటుతున్నారు. ఎన్నో అవమానాలు, అనుమానాలను ఎదుర్కొని నిలబడుతున్నారు.


అయితే అమ్మాయిలకు పెళ్లి కావడం, పిల్లలు పుట్టడంతో తమ కెరియర్‌కు కొంచెం బ్రేక్ పడుతుంది. కనీసం ఏడు, ఎనిమిదేళ్ల వరకూ గ్యాప్ వస్తుంది. దీంతో మళ్లీ తమ కెరీయర్‌ను స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తుంటారు. మరికొంతమంది మళ్లీ విధుల్లో చేరాలనుకుంటారు. అయితే మళ్లీ ఎలా స్టార్ట్ అవ్వాలి..? ఇన్ని రోజులు గ్యాప్ వచ్చాకా మళ్లీ ఎలా ఉద్యోగంలో చేరాలి..? అనే అనుమానాలు అందరిలో కలుగుతాయి. ఇలాంటివారికి కెరీర్‌ నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు.


మళ్లీ ఉద్యోగంలో చేరానుకునేవారు ముందుగా మనస్సులో ఉండే అనుమానాలను పక్కన పెట్టాలి. ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతామా అనే సందేహాన్ని మొదట మనసులోంచి తీసేయాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. గతంలోని విద్యార్హతతోపాటు అప్పటి అనుభవం ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు కొంత అప్‌డేషన్‌ అవసరం. ఆ నైపుణ్యాలను పెంచుకోగలిగితే చాలు. ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.


ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసుకునేటప్పుడు రెజ్యూమ్ చాలా ముఖ్యం. అది కాస్త క్రియేటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. అలానే అందులో కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌ను పొందుపరచాలి. ఇవన్నీ ఎంతగానే ఉపయోగపడతాయి.


విరామం తర్వాత ఉద్యోగానికి వెళ్లాలనుకోవడం మంచిదే. కానీ ఇంటిని, ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకోగలరో లేదో స్పష్టత ఉండాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాలి. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com