ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 12:27 PM
 

కర్నూలు: పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామం నుండి ఆటో తమ్మరాజు పల్లెకు కొండ నుండి ఇంటికి వస్తుండగా, 2వ మలుపు వద్ద డ్రైవర్ అతివేగంతో ఆటోను మలుపు తిప్పడంతో ఆటో కంట్రోలు కాక బోల్తా పడడంతో పిన్నాపురం గ్రామానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయపడిన వారిలో తలారి మహేంద్రకు తలకు, కాలుకు తీవ్ర గాయా లు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. అదే గ్రామానికి చెందిన శీలం వెంకటమ్మ, కందికాయ పల్లె మహేశ్వరికి స్వల్ప గాయాలు కావడం జరిగిందని స్థానికులు తెలిపారు.