అక్టోబర్ 1 నుంచి రాయలసీమ వర్సిటీలో తరగతులు

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 14, 2021, 12:54 PM
 

కర్నూలు జిల్లాలోని రాయలసీమ వర్సిటీలో అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2021-22 ను ఉన్నత విద్యాశాఖ ప్రకటిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి క్యాలెండర్ ప్రారంభమవుతుందని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ఆదేశాల్లో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు అన్నీ ఒకటో తేదీ ప్రారంభించాలని, అదే రోజులు తరగతులు మొదలు పెట్టాలని ఉత్తర్వుల్లో సూచించారు.