శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 14, 2021, 12:52 PM
 

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో 1, 09, 446 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 31, 784 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్  పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుత నీటిమట్టం 882. 20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటినిల్వ 200 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి  కొనసాగుతోంది.