మూడేళ్ల చిన్నారి పై అత్యాచార యత్నం.. కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 08, 2021, 11:53 AM
 

కర్నూలు: మూడేళ్ల చిన్నారి పై పదమూడేళ్ల బాలుడు అత్యాచారం యత్నంకు పాల్పడ్డాడు. ఈ హృదయ విచారక సంఘటన మంత్రాలయం మండలం లోని బూదూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. దళిత సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల చిన్నారిని ఇంటి వద్ద వదిలి పెట్టి పొలం పనులకు వెళ్లారు. ఇంటి పక్కనే ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న పదమూడేళ్ల మైనర్ బాలుడు అత్యాచారం యత్నం చేశాడు.


మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు తల్లిదండ్రులు నిర్మాణం చేస్తున్న ఇంట్లోకి పసికందు ను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడికట్టాడు. ఆ చిన్నారి కి తీవ్ర రక్తస్రావం కావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి తల్లిదండ్రులు సమాచారం అందించారు. పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తన కూతురు కు జరిగిన సంఘటన చూసి తల్లడిల్లిపోయారు. మంత్రాలయం పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఈ హృదయ విదారక సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు అయ్యోపాపం పసిపాపపై ఎంత ఘోరం జరిగిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు మంత్రాలయం ఎస్ఐ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారయత్నంకు పాల్పడిన బాలుడు పరారయ్యాడు. బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి అత్యాచారం యత్నం పై విచారణ నిమిత్తం మంత్రాలయం కు చేరుకున్న జిల్లా యస్ పి సుధీర్ కుమార్ రెడ్డి, ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్.