ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన పక్కన కోహ్లీ పిల్లోడిలా ఉన్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2017, 03:31 PM

కొలంబో: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 కోసం కోహ్లీ సేన ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆదివారం ముగిసింది. ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ ఆ తర్వాత జట్టు సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.


ఆదివారం సాయంత్రం కోహ్లీ ఓ ప్రత్యేక అతిథిని కలిశాడు. ప్రముఖ రెజ్లర్‌తో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ అతనెవరంటే భారత ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ దలీప్‌ సింగ్‌ రానా అలియాస్‌ ద గ్రేట్‌ ఖలీ. ‘ద గ్రేట్‌ ఖలీని కలవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఖలీ పక్కన కూర్చున్న, నిల్చున్న ఫొటోలను కోహ్లీ ట్విటర్‌లో ఉంచాడు. ఆ ఫొటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. 7.1 అడుగుల ఎత్తు ఉన్న ఖలీ పక్కన కోహ్లీ చిన్నోడిలా కనిపిస్తున్నాడు. ఈ ఇరువురి ఫొటోలను చూసిన అభిమానులు నెట్టింట్లో సరదా కామెంట్లు పెట్టారు. ‘ఖలీ పక్కన కోహ్లీ పిల్లోడిలా ఉన్నాడు’, ‘కోహ్లీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు’, ‘ఇలా ఎత్తుగా ఉన్న ఫాస్ట్‌బౌలర్‌ నీకు అవసరం’ అని ఎవరికి నచ్చినట్లు వారు ట్వీట్లు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com