దేశంలో కరోనాతో మొత్తం 4,39,895 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 03, 2021, 12:41 PM
 

దేశంలో నిన్న కొత్తగా 45,352 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,03,289కి చేరింది. అలాగే, నిన్న 34,791 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 366 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,895కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,20,63,616 మంది కోలుకున్నారు. 3,99,778 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67,09,59,968 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. రిక‌వ‌రీ రేటు 97.45 శాతంగా ఉంది. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 32,097 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు.