మహిళపై హత్యాయత్నం

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 31, 2021, 04:58 PM
 

కర్నూలు: నంద్యాల పట్టణానికి చెందిన వరలక్ష్మీపై హత్యా యత్నం చేసిన శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు రెండో పట్టణ సీఐ రమణ తెలిపారు. నూనెపల్లెకు చెందిన వరలక్ష్మీకి కొన్నేళ్ల క్రింద దొర్నిపాడుకు చెందిన శ్రీనివాసరెడ్డితో వివాహమైంది. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంత కాలంగా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న వరలక్ష్మీ పై శ్రీనివాస రెడ్డి అకస్మాత్తుగా కారంపొడి చల్లి దాడి చేసి గాయపరిచాడు. పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.