రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 28, 2021, 02:00 PM
 

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోస్గి-ఐరన్​గల్ మధ్యలో రైల్వేట్రాక్​పై ఇద్దరు మృతి చెందారు. తుంగభద్ర జలాల కోసం వస్తుండగా.. రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆస్పరి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.