హైదరాబాద్ : బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్. ఈ స్టార్‌కు ఇప్పుడు దేశమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో సందడి చేశాడు. ప్రస్తుతం సాహో మూవీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. బాహుబలి స్టార్‌తో ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ తెగ హల్చల్ చేశారు. మరోవైపు ప్రభాస్ వచ్చిన రోజే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించాడు. శ్రద్ధాకపూర్ తన కోస్టార్స్ సిద్ధార్థ్ కపూర్, అంకర్ బటియాతో కలిసి తళుక్కున మెరిసింది.