‘మురసోలి’ వేడుకకు కరుణ రారు: స్టాలిన్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 05, 2017, 08:27 AM
 

చెన్నై: పార్టీ పత్రిక ‘మురసోలి’ వేడుకకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి హాజరు కావడం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో బహుమతులుగా వచ్చిన వాటిలో నుంచి 2 వేలు పుస్తకాలను శ్రీలంకలోని జాఫ్నా గ్రంథాలయానికి అందజేశారు. త్వరలో రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తుందని దిల్లీలో ఆందోళన చేస్తున్న రాష్ట్ర రైతులను ఉద్దేశించి స్టాలిన్‌ అన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.