ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుప్రమాదంలో రాజస్థాన్‌ మంత్రికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2017, 10:40 AM

రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ రాష్ట్ర మంత్రి బాబు లాల్‌ వర్మ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి మంత్రి వాహనం 76వ జాతీయరహదారిపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన గేదెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ మంత్రి, ఆయన సహాయకుడు మోతీలాల్‌ను స్థానిక ఎంబీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోతీలాల్‌ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com