తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య

  Written by : Suryaa Desk Updated: Mon, Apr 12, 2021, 11:19 AM
 

నంద్యాల మండలంలోని కొణిదేడు గ్రామంలో ఆదివారం రాత్రి తల్లితో గొడవ పడొద్దని మందలించిన అన్నను తమ్ముడు హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మధు , స్వామినాయుడు సోదరులు. తమ్ముడు తల్లి మద్దిలేటమ్మతో గొడవపడుతుండగా అన్న ఎందుకు అనవసరంగా వాదులాడుతున్నావని అడుకున్నాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో ఉన్న తమ్ముడు స్వామి నాయుడు కత్తి తీసుకుని మధు తొడ భాగంలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే మధుని శాంతిరాం హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హతుడి తమ్ముడు పరారీలో ఉన్నాడు.