అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టివేత

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 10, 2021, 12:51 PM
 

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద బస్సులో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ నగదు,బంగారం దొరికింది. పట్టుబడిన సొమ్ము చెన్నైలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందినదిగా గుర్తించారు. చేతన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.