సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీలోని ఘజియాబాద్ లో ఓ ఘోరం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటి పక్కనే ఆటోమొబైల్ రిపేర్ షాప్ నిర్వహించే సమీర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 11న ఆమెను తన షాపుకు పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ దారుణాన్ని అక్కడే ఉన్న నిందితుడి బంధువు కెమెరాలో రికార్డు చేశాడు. అనంతరం నిందితుడి బంధువు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత వీడియోను డిలీట్ చేస్తామని ఈ నెల 21న మరో సారి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక విషయం ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.