ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓలా ఆటో డ్రైవర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 04:54 PM

బెంగళూరు: బెంగళూరులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓలా ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు. ఒంటిరిగా ఆటో ఎక్కిన 19 ఏళ్ల విద్యార్థిని పట్ల తిక్కతిక్కగా ప్రవర్తించడంతో ఆటో డ్రైవర్ కటకటాలపాలైనాడు.


బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ లో గురువారం 19 ఏళ్ల విద్యార్థిని ఆటో కోసం వేచి చూస్తున్నది. ఆ సందర్బంలో ఓలా ఆటో డ్రైవర్ మంజునాథ్ అటు వైపు వెళ్లాడు. మంజునాథ్ ఆటోలో విద్యార్థిని కుర్చుకునింది. తరువాత మంజునాథ్ ఆటోను ముందుకు నడిపాడు.


ఆటోకు ఏర్పాటు చేసిన అద్దంలో యువతిని చూస్తూ మంజునాథ్ వెకిలిచేష్టలు చేశాడు. చాల సేపు విద్యార్థిని ఓపిగ్గా ఉంది. అంతటిలో మంజునాథ్ తన వెకిలిచేష్టలు ఆపకుండా వెనుక కుర్చున్న యువతి మీద చేతులు వేశాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని నువ్వు వస్తే ఇద్దరూ లైంగిక కోరిక తీర్చుకోవచ్చని యువతితో అన్నాడు.


నా ఆటోలో ఎంజాయ్ చేద్దాం రా ..తన ఆటోలోనే నిర్జనప్రదేశంలోకి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటూ ఆమెను బలవంతం చేశాడు. భయంతో ఆటో దూకిన యువతి గట్టిగా కేకలువేసింది. వెంటనే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి విషయం చెప్పింది.


పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం గమనించిన ఆటో డ్రైవర్ మంజునాథ్ అక్కడి నుంచి తన వాహనంలో పరారైనాడు. పోలీసులు కంట్రోల్ రూంలో నుంచి బెంగళూరు నగర పోలీసులు అందరికి సమాచారం ఇచ్చారు. ఆటో షెడ్ దగ్గర పార్క్ చేసిన మంజునాథ్ ఇంటిలో తలదాచుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com