రెండు ఆలయాల్లో నగదు అపహరణ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 23, 2021, 04:02 PM
 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా గోనెగండ్లలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. చింతలముని నల్లారెడ్డి, కాశీ నీలకంటేశ్వరస్వామి ఆలయాల్లో దుండగులు హుండీ పగలగొట్టి భక్తుల కానుకలు, నగదును అపహరించారు. రెండు ఆలయాల హూండీల్లో రూ. నాలుగు లక్షల వరకు నగదు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.