టాలీవుడ్ పాపులర్ స్టైలిస్ట్ నీరజ కోన డిస్ట్రిబ్యూటర్ గా మారనుంది. మొన్నటి వరకు స్టార్ హీరో, హీరోయిన్స్ కి స్టైలిస్ట్ గా వ్యవహరించిన నీరజ తన ఫ్రెండ్ , హీరో నితిన్ సినిమా లై ని డల్లాస్ లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. లై చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోగా ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నితిన్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో అర్జున్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి రెండు సాంగ్స్ విడుదల కాగా, ఇవి ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తున్నాయి.