ఓంకారం క్షేత్రంలో బండలాగుడు పోటీలు

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 11, 2021, 01:16 PM
 

మహా శివరాత్రి పండగను పురస్కరించుకొని ఓంకార క్షేత్రంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను బుధవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పాలపండ్ల వృషభ ప్రదర్శనలో గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన శైశాచౌదరి, శివరామకృష్ణల వృషభాలు 4200 అడుగుల అత్యధిక దూరాన్ని లాగి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ద్వితీయస్థానంలో ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన మహబూబ్‌బాష, వెంకటసుబ్బారెడ్డిలకు చెందిన వృషభాలు 3865 అడుగుల దూరాన్ని లాగాయి.
బండి ఆత్మకూరు మండలం ఎ కోడూరుకు చెందిన చాగంటి నాగేశ్వరరెడ్డి వృషభాలు 3732 అడుగుల దూరాన్ని లాగి తృతీయ స్థానంలో, గడివేముల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బోయిన వెంకటేశ్వర్లు వృషభాలు 3642 అడుగుల దూరాన్ని లాగి నాల్గో స్థానం, మైలవరం మండలం చిన్న కోమెర్ల గ్రామానికి చెందిన సమరేశ్వరరెడ్డి వృషభాలు 3600 అడుగుల దూరాన్ని లాగి ఐదో స్థానం దక్కించుకున్నాయి.
వీరికి వరుసగా రూ. 35వేలు, రూ. 25వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు నగదు బహుమతులను వైసిపి మండల కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేసు వెంకటరామిరెడ్డి, బారెడ్డి భాస్కర్‌రెడ్డి, పెప్సీ నాగేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, చక్రపాణి, శంకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నర్ల సుబ్బారెడ్డి, అవుటాల నాగేశ్వరరెడ్డి, లింగాల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.