న్యూఢిల్లీ : ఆధార్ సంఖ్యను జారీచేసే భారతదేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఇప్పుడు సరికొత్తగా మొబైల్ ఆధార్ (ఎం-ఆధార్) యాప్‌ను ప్రారంభించింది. దీనిని డౌన్లోడ్ చేసుకుంటే ఇక మీ ఫోన్లోనే ఆధార్‌కార్డ్ వివరాలు ఉంటాయి. ఎం-ఆధార్ యాప్‌ను ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులే వినియోగించుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. దీనిద్వారా సులువుగా, సౌకర్యవంతంగా గుర్తింపు రుజువులు చూపించొచ్చు. యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకు మొబైల్ నంబరును తప్పనిసరిగా ఆధార్‌కు లింక్ చేసుకోవాలి. యాప్ ద్వారా ఆధార్‌కు అనుసంధానం చేసిన బయోమెట్రిక్ సమాచారాన్ని భద్రపర్చుకునే సౌకర్యం కూడా ఉంది. ఆధార్ ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకుని క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యాప్‌తో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, అన్ని సేవలను పూర్తిస్థాయిలో అందిస్తామని యూఐడీఏఐ తెలిపింది.