గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 17, 2021, 01:06 PM
 

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు మండలము పెంచికలపాడు గ్రామ సమీపంలో ఉన్న విశ్వ భారతి హాస్పిటల్ దగ్గర గుర్తు తెలియని వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించాడు. కాగా చనిపోయిన వ్యక్తిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు మార్చరీ రూమ్ నందు పెట్టడము జరిగిందని, ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వారు కె.నాగలాపురం ఎస్సైకు (9121101068), 8500705113 కు సమాచారం ఇవ్వగలరని తెలియజేశారు.