జైలుకెళ్లేందుకైనా సిద్ధమే : మమతా బెనర్జీ

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 05:56 PM
 

కోల్‌కతా : వస్తు సేవల పన్ను(జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. తాను ఎవరికీ తలవంచను జైలుకెళ్లేందుకైనా సిద్ధమే అని మమత స్పష్టం చేశారు. బీజేపీకి ఎవరూ మద్దతు ఇవ్వొద్దన్న ఆమె నిరసన తెలిపేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశానని తెలిపారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో అశాంతి నెలకొన్నదని తెలిపారు. ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ సంస్థలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.