టీటీడీ చైర్మన్ పదవి నేను అడగడం లేదు: ఎంపీ

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 03:45 PM
 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవిని తాను అడగడం లేదని, మరి, ఆ పదవి ఎవరికిస్తారో తనకు తెలియదని టీడీపీ ఎంపీ రాయపాటి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాల మేరకు రామ్ నాథ్ కోవింద్ కు ఓటు వేశానని, ఏపీ నుంచి యూపీఏ తరపు అభ్యర్థికి ఎవరూ ఓటు వేయలేదని చెప్పారు. జగన్ తన సొంత అవసరాల కోసమే రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇచ్చారని, అంతమాత్రాన ఆయన్ని కేసుల నుంచి మోదీ బయటపడేస్తారనుకోవడం పొరపాటని అన్నారు.