ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేల రాంగ్ ఓటింగ్

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 03:29 PM
 

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అమరావతిలోనే ఓటు వేశారు. ఎంపీ రాయపాటి, మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గౌతమ్ రెడ్డి, పెద్దరెడ్డిలు కొంచెం ఆలస్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో విషయం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తోంది. టీడీపీకి చెందిన ఎమ్మల్యేలు కదిరి బాబూరావు, జితేందర్ గౌడ్ లు రాంగ్ ఓటింగ్ చేశారు. వీరిద్దరూ బ్యాలెట్ పేపర్లపై తన పేర్లను రాశారు.