ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన జేసీ

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 03:20 PM
 

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి బయల్దేరారు. తనపై విమానయాన సంస్థలు ట్రావెల్ బ్యాన్ విధించిన నేపథ్యంలో, జేసీకి ఈ కష్టం వచ్చింది. అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయన అరుణ్ జైట్లీతో సమావేశమవుతారని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కూడా ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని కొన్ని రోజుల క్రితం జేసీకి సూచించిన విషయం తెలిసిందే.